V6 News

ట్యాంకర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..ముగ్గురికి తీవ్ర గాయాలు .. రంగారెడ్డి జిల్లాలో ఘటన

ట్యాంకర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..ముగ్గురికి తీవ్ర గాయాలు .. రంగారెడ్డి జిల్లాలో ఘటన

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం మోకిలా పీఎస్​పరిధిలో ఆర్టీసీ బస్సు వాటర్​ట్యాంకర్​ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి10 గంటలకు మెహిదీపట్నానికి చెందిన ఆర్టీసీ బస్సు శంకర్​పల్లి నుంచి నార్సింగి వైపు వెళ్తోంది. జన్వాడలోని బంగారు మైసమ్మ ఆలయం వద్దకు రాగానే యూటర్న్​తీసుకుంటున్న వాటర్​ట్యాంకర్​ను ఎడమవైపు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రవీందర్​(27), కండక్టర్ లక్ష్మణ్​ కుమార్​(50), ప్రయాణికుడు ఇస్మాయిల్​(27) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడిన వారిని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు.  బస్సు డ్రైవర్​రవీందర్.. క్యాబిన్​లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటికి తీసేందుకు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరాబాబు తెలిపారు.